ఈ నెల 27న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రాబోతున్న క్రేజీ సినిమా !

ఈ నెల 27న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రాబోతున్న క్రేజీ సినిమా !

Published on Jul 8, 2018 4:07 PM IST

Saakshyam2

శ్రీవాస్ దర్శకత్వంలో యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. ఈ చిత్రం పంచభూతాలు అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందించారు. ఇప్పటికే విడుదలైన పోస్ట్రర్లు, టీజర్ లతో పాటు ట్రైలర్ కూడా బాగుండటంతో సినిమా ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐతే మొదట ఈ చిత్రాన్ని జూలై 20వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని జూలై 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. కాగా శక్తికాంత్ కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. అభిషేక్ పిక్చర్స్ పతాకం పై ఈ చిత్రం రూపొందింది.

తాజా వార్తలు