‘సైరా’లో నటించనున్న మెగా డాటర్!

‘సైరా’లో నటించనున్న మెగా డాటర్!

Published on Jul 26, 2018 3:32 PM IST

Niharika31

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , విజయ్ సేతుపతి , రవికిషన్, సుధీప్, తమన్నా వంటి ప్రముఖ తారాగణం నటిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం మెగా డాటర్ కొణిదల నిహారిక కూడా సైరా చిత్రంలో నటిస్తోన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సైరా చిత్రంలో మెగాస్టార్ పక్కన తాను కూడా నటించాలనే కోరిక మేరకు ఈ చిత్రంలో ఓ గిరిజన యువతిగా కనిపించనున్నట్లు తెలిపారు. కాకపొతే రెండు మూడు సన్నివేశాల్లో మాత్రమే ఆమె కనిపిస్తారట. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈచిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు