సవ్యసాచి గురించి క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీస్ !

సవ్యసాచి గురించి క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీస్ !

Published on Jul 30, 2018 7:44 PM IST

Savyasachi

చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా, నిధి అగర్వాల్ కథానాయకిగా తెరకెక్కుతున్న చిత్రం ‘సవ్యసాచి’. ఈ చిత్రంలో తమిళ నటుడు ఆర్.మాధవన్, మాజీ హీరోయిన్ భూమిక కూడా కీలకపాత్రల్లో నటిస్తుండటం విశేషం. కాగా గతకొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించి అనేక రూమర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి. వీటిన్నటికి సమాధానంగా ఈ చిత్రం షూటింగ్ చివరిదశలో ఉందని, త్వరలోనే హైదరాబాద్ లో కూడా షూట్ జరగనుందని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ రోజు అధికారికంగా వెల్లడించింది.

వెన్నెల కిషోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. బాహుబలి చిత్రానికి గ్రాఫిక్స్ ను అందించిన మకుట సంస్థనే ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్ ను అందిస్తోంది. ప్రేమమ్ తరువాత చైతు, చందూ మొండేటిల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

తాజా వార్తలు