సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రాండ్ బాబు’. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని శైలేంద్ర బాబు నిర్మించారు. కాగా ప్రముఖ దర్శకుడు మారుతీ ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. ఈ చిత్రం ఆగష్టు 3న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా విడుదలకాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర హీరో సుమంత్ శైలేంద్ర, మీడియాతో మాట్లాడుతూ ఓ ఆసక్తి కరమైన విషయాన్ని మీడియాతో పంచుకున్నారు.
ఆయన తెలుగులో హీరోగా చేయాలనుకోవటానికి కారణం తెలుగు ప్రేక్షకులు మంచి అభిరుచిగలవారని, మిగిలిన భాషల ప్రేక్షకులతో పోల్చుకుంటే. తెలుగు ప్రేక్షకులు కొత్త టాలెంట్ ను ఎప్పుడు ప్రోత్సాహిస్తారని సుమంత్ శైలేంద్ర చెప్పుకొచ్చారు.
అదికాక తెలుగు సినిమా విడుదలవుతుంటే ఓ పండగ వాతావరణం ఉంటుందని అంతలా ఇక్కడ సినిమాను ప్రేమిస్తారు. అన్నిటికి మీంచి కన్నడాతో కంపేర్ చేస్తే తెలుగు చాలా పెద్ద మార్కెట్ అందుకే ఎప్పటినుంచో తెలుగులో సినిమా చెయ్యటానికి ఆసక్తి చూపుతున్నట్లు సుమంత్ శైలేంద్ర చెప్పారు.


