క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘ఎన్టీఆర్ బయోపిక్’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం, మొదటి షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో సెకెండ్ షెడ్యూల్ కోసం చిత్రబృందం సన్నద్ధం కాబోతుందని తెలుస్తోంది. ఆగష్టు 13వ తేదీ నుండి ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ ను చిత్రబృందం తెరకెక్కించబోతున్నారు.
కాగా ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ గారు బసవతారకమ్మగారి అనుబంధాన్ని తెలియచెప్పే సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ముఖ్యంగా బసవతారకమ్మగారి చివరి రోజుల్లోని సంఘనటలను, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఎన్టీఆర్ గారు ఎదుర్కొన్న ఇబ్బందులను షూట్ చేయబోతున్నారు. ఐతే బసవతారకమ్మగారి పాత్రను పోషిస్తున్న విద్యాబాలన్ ఇప్పటికే ఆమె హావభావాల దగ్గర నుంచి ఆమె మాట్లాడే విధానం వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోని మరి నటిస్తుండటం విశేషం. బసవతారకంగారి పాత్రకు విద్యాబాలన్ తన నటనతో నిండుదనం తెస్తుందని చిత్రబృందం బలంగా నమ్ముతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.


