సూపర్ స్టార్ కు ఆ సినిమా బాగా నచ్చిందట !

సూపర్ స్టార్ కు ఆ సినిమా బాగా నచ్చిందట !

Published on Aug 19, 2018 10:27 PM IST

Rajinikanth3

తలైవా రజినీకాంత్ కు ఒక సినిమా బాగా నచ్చిందట. అదేదో సినిమా కాదు నయనతార ప్రధాన పాత్రలో నటించిన ‘కొలమావు కోకిల’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం తమిళనాడులో రెండు రోజుల్లోనే 7కోట్ల గ్రాస్ ను రాబట్టి సంచలన విజయం దిశగా దూసుకుపోతుంది. ఇక తాజాగా ఈచిత్రాన్ని చూసిన రజినీ చిత్ర టీం ను అభినందిచారు. చిత్రం చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నానని సినిమా చాలా బాగుందని చిత్ర డైరెక్టర్ నెల్సన్ కి ఫోన్ చేసి మాట్లాడారు సూపర్ స్టార్. ఇక స్వయంగా రజినీ నే ఫోన్ చేసి చిత్రాన్ని మెచ్చుకొనే సరికి చిత్ర యూనిట్ అందానికి ఆవదులు లేకుండా పోయింది.

ఇక రజినీ ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో విజయ్ సేతుపతి, బాబీ సింహాలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు