త్వరలో నిర్మాణం మొదలపెడుతున్న రచయిత !

త్వరలో నిర్మాణం మొదలపెడుతున్న రచయిత !

Published on Aug 19, 2018 8:00 PM IST

saimadhav

సీరియల్ రైటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టి స్టార్ రైటర్ గా ఎదిగారు బుర్రా సాయిమాధ‌వ్‌. ప్రస్తుతం తెలుగులో ఎక్కువ సినిమాలు రాస్తున్న రచయిత, ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న ర‌చ‌యిత‌ కూడ ఈయనే. ‘సైరా, ఎన్టీఆర్ ఇలా భారీ చిత్రాలకు ఆయనే మాటలు అందిస్తున్నారు.

కాగా బుర్రా సాయిమాధ‌వ్‌ రచన చేస్తూనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించ‌బోతున్నారు. కాకపోతే అయన నిర్మించేది సినిమా కాదులేండి. త్వరలో వెబ్ సిరీస్‌లను రూపొందించనున్నారు. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా నిర్మాతగా మారారని తెలుస్తోంది. గతంలోనే ‘సినిమా టాకీస్‌`’అనే బ్యానర్ ను కూడా స్థాపించారు. ఆ బ్యానర్ పై ఆయన వరుసగా వెబ్ సిరీస్‌లును నిర్మించ‌డానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొదటిగా నిర్మించే వెబ్ సిరీస్ కు పూర్తి స్క్రిప్టు కూడా రెడీ అయిందని తెలుస్తోంది. సాయిమాధ‌వే స్వయంగా ఈ స్క్రిప్ట్ ను రాశారు.

తాజా వార్తలు