ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ ఈ రోజు ఉదయం విడుదల అయి రికార్డ్ స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది. అయితే సైరా టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఈ చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ రోజు ఈ చిత్రం ఇలా మనం ముందుకు వస్తుందంటే దానికి ముందుగా ఇద్దరే కారణం అని చెప్పాలి. వారే పరుచూరి బ్రదర్స్.. నిజంగా 12 సంవత్సరాలుగా కలిసిన ప్రతిసారి నాన్నగారికి ఈ సినిమా గురించి చెప్పమనేవారు. సైరా చిత్రం తెరకెక్కటానికి పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావుగార్ల సంకల్పం ఎంతో ఉంది. అందుకు వారికి థాంక్స్ అని అన్నారు
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


