‘భీష్మ’తో బిజీ అవుతున్న నితిన్ !

‘భీష్మ’తో బిజీ అవుతున్న నితిన్ !

Published on Aug 21, 2018 4:29 PM IST

Nithin

నితిన్ హీరోగా ‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వవంలో ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ‘ఛలో’ మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ పూర్తి చేశారట. ఈ నెల ఆఖర్లో ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మొదట ఆగష్టు మొదటి వారంలోనే షూట్ మొదలపెట్టాలని చిత్రబృందం భావించింది. కానీ నితిన్ శ్రీనివాస కళ్యాణం చిత్రంతో బిజీగా ఉండటం కారణంగా లేట్ అయింది.

కాగా ప్రస్తుతం నితిన్ భీష్మ చిత్రం పై దృష్టి పెట్టారు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా విన్న నితిన్ ఇక ఈ చిత్రానికి పూర్తి అందుబాటులో ఉండనున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్ గా నటిస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది.

తాజా వార్తలు