సెన్సార్ పూర్తి చేసుకున్న కోకో కోకిల !

సెన్సార్ పూర్తి చేసుకున్న కోకో కోకిల !

Published on Aug 22, 2018 6:04 PM IST

nayanatara

అగ్ర హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తమిళ భాషలో నటించిన చిత్రం’కొలమావు కోకిల’. ఆగస్టు 17న విడుదలైన ఈ చిత్రం అక్కడ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో విడుదలకానుంది. ఇక ఈ రోజు ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈచిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. నూతన దర్శకుడు నెల్సన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో శరణ్య, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. మరి తమిళ్లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో తెలియాలంటే ఈ నెల 31 వరకు వేచి చూడాలి.

తాజా వార్తలు