తెలుగులో అగ్ర దర్శకుడిగా ఓ వెలుగు వెలిగిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల సరైన విజయాలు లేక బాగా వెనుకపడిపోయారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రాల్లో ‘టెంపర్’ చిత్రం తప్ప మిగితా సినిమాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దాంతో ఈ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి అటు స్టార్ హీరోలే కాదు కుర్ర హీరోలు కూడా ఆసక్తిని చూపించడం లేదు. ఇక ఇప్పుడు కొత్త వారితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు.
లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కే ఈచిత్రంలో నటించడానికి నటి నటులు కావాలని ప్రకటన కూడా ఇచ్చారు పూరి. మరి ఈ చిత్రంతోనైనా విజయం సాధించి మళ్ళీ ఆయన స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటారో లేదో చూడాలి.


