సిల్లీ ఫెలోస్ కి సాయం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ !

సిల్లీ ఫెలోస్ కి సాయం చేస్తున్న మహేష్ ఫ్యాన్స్ !

Published on Aug 26, 2018 5:30 PM IST

Silly Fellows

వరుస విజయాల నుంచి వరస పరాజయాలతో అల్లరి నరేష్ గత కొంతకాలంగా సతమతవుతున్నాడు. కాగా తాజాగా భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో సునీల్ తో కలిసి ‘సిల్లీ ఫెలోస్ ‘ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పై నరేష్ మరియు సునీల్ చాలానే హోప్స్ పెట్టుకున్నారు. అయితే ఈ రోజు సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చేతుల మీద ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. దాంతో మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తుండటం విశేషం.

కాగా బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమనేని శ్రీనివాస్ ఈ చిత్రాన్ని పూర్తి హాస్యభరితంగా తెరకెక్కించారట. ఐతే జంధ్యాల గారి పాత చిత్రానికి ఈ చిత్రం ప్రేరణ అని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్ గా నటించిన పూజా ఝావేరి గతంలో విజయ్ దేవరకొండ సరసన ద్వారకా చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

తాజా వార్తలు