యు టర్న్ విడుదల ఫై క్లారిటీ ఇచ్చిన సమంత !

యు టర్న్ విడుదల ఫై క్లారిటీ ఇచ్చిన సమంత !

Published on Aug 28, 2018 1:50 AM IST

samantha2

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యు టర్న్. తెలుగు , తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె జర్నలిస్టు గా నటించింది. ఇక ఈచిత్రం అనుకున్న తేదీకి విడుదలకాకపోవచ్చు అని వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు సమంత. ఈచిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకే సారి విడుదలకానుందని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కన్నడలో విజయం సాధించిన యు టర్న్ చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో భూమిక , అది పినిశెట్టి , రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం ఫై శ్రీనివాస్ చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం అందించారు.

తాజా వార్తలు