రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

రవితేజ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !

Published on Oct 25, 2018 1:04 PM IST

Amar Akbar Anthony

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇటీవల ఈచిత్రం గురించి అప్డేట్స్ లేకపోవడంతో రవి తేజ అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఇప్పుడు వారికీ గుడ్ న్యూస్. ఈ చిత్రానికి సంభందించిన ఓక ముఖ్యమైన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 6గంటలకు రివీల్ చేయనున్నారు. బహుశా ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ని కానీ లేక టీజర్ విడుదల గురించి ప్రకటన చేసే అవకాశం వుంది.

నిజానికి ఈచిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేయాల్సివుంది కానీ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ మొదటగా నాగ చైతన్యనటించిన ‘సవ్యసాచి’ ని విడుదల చేస్తుడడంతో ఈ చిత్రం వెనక్కి వెళ్ళిపోయింది.

కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో రవితేజ మూడు డిఫ్రెంట్ గెటప్స్ లో కనబడనున్నాడు. శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా కథానాయికగా నటించింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు