
దళపతి విజయ్ నటించిన 62వ చిత్రం ‘సర్కార్’ విడుదలకు అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ తో చిత్రం విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. ఇక దాంతో ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 6న గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈచిత్రానికి దక్షిణాది రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. మురుగదాస్ తెరకెక్కించిన ఈచిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా రాధా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. సన్ పిక్చర్స్ పతాకం ఫై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఇక తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు.

