
దర్శకడు రవిబాబు సుదీర్ఘమైన విరామం తర్వాత తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం ‘అదుగో’. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పందిపిల్ల కావడంతో ప్రేక్షకుల్లో కూడా ఈ చిత్రం పై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. పైగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో వస్తుండటంతో ‘అదుగో’ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం గతంలోనే సన్నాహాలు చేసింది. పోస్ట్ ప్రొడక్షన్స్ కారణాల వల్ల విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.
కాగా తాజాగా ఈ చిత్రాన్ని నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రం కొత్తదనం కోరుకొన్నే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నెలా రూపొందింది. రవిబాబు కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

