ఫోక్ సాంగ్ చిత్రీకరణలో సూర్య 37 !

ఫోక్ సాంగ్ చిత్రీకరణలో సూర్య 37 !

Published on Oct 28, 2018 10:18 PM IST

Surya1

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న 37వ చిత్రం ప్రస్తుతం ఫోక్ సాంగ్ చిత్రీకరణను జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రం ఇప్పటివరకు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈ ఏడాది చివర్లో ఈచిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ ను పూర్తి చేయాలనీ భావిస్తున్నాడట సూర్య.

కేవీ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక సూర్య నటించిన 36వ చిత్రం ‘ఎన్జీకె’చివరి షెడ్యూల్ నవంబర్లో జరుగనుంది. సెల్వ రాఘవన్ తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని డిసెంబర్ చివర్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు