‘సర్కార్’ కోసం తమిళ్ సర్కార్ పై ఫ్యాన్స్ ఒత్తిడి !

‘సర్కార్’ కోసం తమిళ్ సర్కార్ పై ఫ్యాన్స్ ఒత్తిడి !

Published on Nov 2, 2018 2:26 AM IST

sarkar42

స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా వస్తోన్న ‘సర్కార్’ చిత్రం ప్రస్తుతం కొత్త రికార్డులను సృష్టించుకుంటూ పోతుంది. ఇప్పటికే తమిళనాడులో విజయ్ సినిమాల్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘సర్కార్’ తెలుగు వెర్షన్ మొత్తం 750 స్క్రీన్లలో విడుదల అవ్వడం విశేషం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ‘సర్కార్’ చిత్రాన్ని చెన్నైలోని రోహిణి థియేటర్ లో నాన్ స్టాప్ గా 48 గంటలపాటు ప్రదర్శించేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే విజయ్ ఫ్యాన్స్ ఒత్తిడి తెస్తున్నారు. ఫ్యాన్స్ కోరికను తమిళనాడు ప్రభుత్వం నెరవేస్తోందో లేదో చూడాలి. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే మణిరత్నం నవాబ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అశోక్ వల్లభనేనినే, సర్కార్ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు