మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12వ చిత్రం యొక్క షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే వారంలో ఈ చిత్ర షూటింగ్ పూర్తి కానుంది. ఇక తాజాగా ఈ చిత్రంలో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ తన పాత్ర తాలూకు షూటింగ్ ను పూర్తి చేశారు.
ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ నటీనటులు స్నేహ , ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డీవీవీ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదలకానుంది.


