‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ విడుదలతేదీ ఖరారు !

‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ విడుదలతేదీ ఖరారు !

Published on Nov 20, 2018 10:28 AM IST

Subramanyapuram31

హీరో సుమంత్ నటించిన 25వచిత్రం ‘ సుబ్రహ్మణ్యపురం’ విడుదలకు సిద్దమవుతుంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ నాస్తికుడిగా, దేవాలయాల మీద పరిశోధన చేసే పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ ను నవంబర్ 21న రాత్రి 7గంటలకు విడుదల చేయనున్నారు.

నూతన దర్శకుడు సంతోష్ జాగర్లమూడి తెరక్కిస్తున్న ఈచిత్రంలో ఈశా రెబ్బ కథానాయికగా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. భీరం సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నాఈచిత్రం డిసెంబర్ 7న విడుదలకానుంది. ఇక ఈచిత్రం తోపాటు సుమంత్ నటించిన మరో చిత్రం ‘ఇదం జగత్’ కూడా అదే నెలలో విడుదలకానుంది.

తాజా వార్తలు