బర్త్ డే కు గోవాలో చైతూ !

బర్త్ డే కు గోవాలో చైతూ !

Published on Nov 23, 2018 12:44 PM IST

pr2

యువ సామ్రాట్ నాగ చైతన్య ఈరోజు తన 32వ పుట్టిన రోజున జపరుపుకుంటున్నాడు. ఈ వేడుకను ఆయన తన సతీమణి సమంత మరియు స్నేహితులతో కలిసి గోవా లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక నాగ చైతన్య , సమంత జంటగా నటిస్తున్న కొత్త చిత్రం నిన్ననే ఒక షెడ్యూల్ ను ముగించుకుంది. ఈచిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ నెల 26న హైదరాబాద్ లో జరగనుంది.

ఇక ఈ చిత్రం నుండి చైతూ బర్త్ డే సందర్భంగా చైతు ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో చైతు ,సమంత భార్యాభర్తలు గా నటిస్తున్నారు. శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హరీష్ పెద్ది ,సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు