హిట్ కోసం ఈ క్రియేటివ్ డైరెక్టర్.. !

హిట్ కోసం ఈ క్రియేటివ్ డైరెక్టర్.. !

Published on Nov 23, 2018 5:46 PM IST

krishna vamsi

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ‘కృష్ణ వంశీ’ గత కొన్ని సంవత్సరాలుగా హిట్ కాదు కదా కనీసం యావరేజ్ సినిమాను కూడ తీయలేకపోతున్నారు. ఈ మధ్య ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా తన హావా చూపించిన ఈ వినూత్న దర్శకుడికి ఇప్పుడు ఓ రీమేక్ కథను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ నటుడు నానా పటేకర్ ప్రధాన పాత్రగా మరాఠీలో రూపొంది మంచి విజయం సాధించిన ‘నటసామ్రాట్’ చిత్రాన్ని కృష్ణ వంశీ తెలుగులోకి రీమేక్ చెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ ను తీసుకోవాలని కృష్ణ వంశీ భావిస్తున్నారట.

ఏమైనా కుటుంబ కథా చిత్రాలు తియ్యడంలో మరియు ఆర్టిస్ట్ ల నుంచి మంచి నటనను రాబట్టడంలో కృష్ణ వంశీకి మంచి అభిరుచి ఉంది. మరి ఈ రీమేక్ కథతోనైనా కృష్ణ వంశీ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

తాజా వార్తలు