మారుతి చేతుల మీదుగా విడుదలైన ‘మంచు కురిసే వేళలో ‘ టీజర్!

మారుతి చేతుల మీదుగా విడుదలైన ‘మంచు కురిసే వేళలో ‘ టీజర్!

Published on Nov 23, 2018 11:00 AM IST

mmaruthi3

రామ్ కార్తీక్, ప్రనాలి హీరో,హీరోయిన్లుగా బాల బోడెపూడి స్వీయ దర్శకత్వంలో ప్రణతి ప్రొడక్షన్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘మంచు కురిసే వేళలో. తాజాగా ఈ చిత్రం యొక్క టీజర్ ను లాంచ్ చేశారు ప్రముఖ దర్శకుడు మారుతి.

ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ టీజర్ చాలా బాగుంది అలాగే ఫోటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. టీజర్ చూస్తే హీరో రామ్ కార్తీక్ చాలా అనుభవం ఉన్నట్టుగా నటించాడనిపించింది. టీం అందరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

దర్శక నిర్మాత బాల మాట్లాడుతూ ఈచిత్రం అందమైన లొకెషన్స్ లొ అంతే అందమైన కథ కథనాలతొ తీసిన స్వచ్చమైన ప్రేమకథ. సంగీతం, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. రామ్ కార్తీక్ కెరీర్‌లో ఇదొక మంచి సినిమా అవుతుంది. చిత్రీకరణ పూర్తి చేసి నిర్మాణాంతర కార్యక్రమాలను కంప్లీట్ చేశాము. ఈ నెలలో ఆడియోను విడుదల చేసి డిసెంబర్ లొ సినిమాను విడుదల చెస్తామన్నారు.

టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు