
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించనున్న 59వ చిత్రం బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘పింక్’ కు రీమేక్ గా తెరకెక్కనుట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈవార్తలను నిజమేనని ధ్రువీకరించారు పింక్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ షూజిత్ సిర్కార్. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మించనున్న ఈచిత్రంలో అజిత్ , అమితాబ్ పోషించిన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ను డిసెంబర్ మూడవ వారంలో ప్రారంభించి చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాన్నారట. అలాగే ఈచిత్రానికి ఎఆర్ రహెమాన్ సంగీత అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. మరో రెండు రోజుల్లో ఈ చిత్రానికి సంభందించిన టీం ను ఫైనలైజ్ చేయనున్నారు.
ఇక ఇదిలావుంటే శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ విడుదలకు రెడీ అవుతుంది. వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కు ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

