‘శంకర్‌’ సినిమాలో వెన్నల కిషోర్ కన్‌ఫార్మ్‌ !

‘శంకర్‌’ సినిమాలో వెన్నల కిషోర్ కన్‌ఫార్మ్‌ !

Published on Nov 28, 2018 7:08 PM IST

Vennela Kishore

స్టార్‌ డైరెక్టర్ శంకర్‌ – కమల్‌ హాసన్‌ ల కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం దర్శకుడు శంకర్‌ భారతీయుడు సీక్వెల్‌ ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబ‌రు నెలాఖర్లో ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇతర భార‌తీయ భాష‌లన్నిట్లోనూ ఈ సినిమా విడుదల అవుతుందట. అందుకే శంకర్ తమిళ నటులతో పాటు ఇతర భాషల నటులను కూడా ఈ సినిమాలో తీసుకుంటున్నాడు. కాగా ఈ క్రమంలో తెలుగు కమెడియన్ వెన్నల కిషోర్ ను ఓ కామిక్ పాత్ర కోసం ఈ సినిమాలో ఎంపిక చేశారు.

అలాగే మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ్ హీరో శింబు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించనున్న విషయం తెలిసిందే. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్ముస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు