‘శంభో శంకర’ చిత్రంతో కమెడియన్ షకలక శంకర్ హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఈ చిత్రం తరువాత హీరోగా శంకర్ తన రెండో చిత్రం ‘డ్రైవర్ రాముడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటుంది. టాకీ పార్ట్‌తోపాటు క్లైమాక్స్‌లో భాగంగా వచ్చే కీలక సన్నివేశాలను షకలక శంకర్ ఇతర తారాగణంపై చిత్రీకరిస్తున్నారు. ఇదే షెడ్యూల్లో భారీ ఛేజ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్‌తో డ్రైవర్ రాముడు టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చాలా సంతృప్తికరంగా ఉంది. షకలక శంకర్ కెరీర్లో మరో హిట్ చిత్రంగా నిలుస్తుందనే నమ్మకం ఉంది అని దర్శక, నిర్మాతలు వెల్లడించారు.
ఈ చిత్రంలో హర్షిత సింగ్, ప్రదీప్ రావత్, నజర్ , ధన్ రాజ్, మహేష్ విట్టా, కంచరపాలెం కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.


