
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన విజువల్ వండర్ 2.0 ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం గురు ,శుక్ర వారాల్లో దేశవ్యాప్తంగా 135కోట్లు అలాగే ఓవర్సీస్ లో 55కోట్ల వసూళ్లను రాబట్టి రెండు రోజులకు గాను మొత్తంగా 190 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసిందని సమాచారం. ఇక నిన్నటి తో ఈ చిత్రం 200 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది. అయితే శనివారం వసూళ్లు పూర్తి స్థాయిలో తెలియాల్సివుంది.
ఇక ఈ చిత్రం అటు బాలీవుడ్ లో సెన్సేషన్ సృష్టిస్తుంది. నిన్న ఒక్క రోజే ఈచిత్రం అక్కడ సుమారుగా 25కోట్ల షేర్ ను రాబట్టి మూడు రోజులకుగాను 62.5 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. సోమవారం తో ఈ చిత్రం అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరనుంది. శంకర్ తెరకెక్కించిన ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.

