విక్రమ్ నటించనున్న భారీ బడ్జెట్ చిత్రం లాంచ్ !


తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించనున్న భారీ బడ్జెట్ చిత్రం ‘మహావీర్ కర్ణ’ నిన్న కేరళ లో లాంచ్ అయ్యింది. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో న్యూ యార్క్ బేస్డ్ నిర్మాణ సంస్థ యునైటెడ్ ఫిలిం కింగ్ డమ్ నిర్మిస్తున్న ఈచిత్రంలో విక్రమ్ , కర్ణుడి పాత్రలో కనిపించడనుండగా భీముడి పాత్ర కోసం పలువురు హాలీవుడ్ యాక్టర్స్ ను సంప్రదిస్తున్నారు.

‘మహాభారతం’ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఆర్ ఎస్ విమల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్రం తమిళ , హిందీ భాషల్లో తెరకెక్కుతుండగా మిగితా భాషల్లోకి అనువాదం కానుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

Exit mobile version