
తన నటన మరియు అందంతో యావత్ భారత చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల తార శ్రీ దేవి. 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో శ్రీ దేవి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా శ్రీ దేవి తన నటించబోయే రెండవ చిత్రానికి అంగీకారం తెలిపిందని, అది కూడా 1990లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఖుదా గవా’ చిత్ర సీక్వెల్ లో శ్రీ దేవి నటించనుందని సమాచారం. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మరియు అభిషేక్ బచ్చన్ ల సరసన శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేయనున్నారు. గతంలో వచ్చిన ఈ చిత్ర ఒరిజినల్ వర్షన్ లో కూడా అమితాబ్ బచ్చన్ మరియు నాగార్జునల సరసన కూడా శ్రీ దేవి ద్విపాత్రాభినయం చేశారు. మనోజ్ దేశాయ్ నిర్మించనున్న ఈ చిత్రానికి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి.
మరో సినిమా చేయబోతున్న శ్రీ దేవి
మరో సినిమా చేయబోతున్న శ్రీ దేవి
Published on Jul 16, 2012 4:34 PM IST
సంబంధిత సమాచారం
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- కళ్లుచెదిరే రేటుకు ‘జైలర్ 2’ ఓటీటీ రైట్స్..?
- బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న మోహన్ లాల్ కూతురు మొదటి సినిమా!
- ఇంటర్వ్యూ : కామాక్షి భాస్కర్ల – ‘అగధ’ చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను..!
- సంపత్ నంది సరికొత్త ప్రాజెక్ట్ లాంచ్.. ఎప్పుడంటే..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ఇరుముడి’ నుంచి మల్లెపూల పల్లకి.. ఫుల్ వైబ్ కి ముహూర్తం ఖరారు!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పూరీ జగన్నాధ్‌కు అడ్డుపడుతున్న విజయ్ సేతుపతి..!
- ‘ఇరుముడి’తో క్లాష్.. దుల్కర్ సినిమా వాయిదా!?
- Mega 158: ‘చిరు’ లీక్.. టైటిల్స్ ఎన్నెన్నో.. అన్నీ క్రేజీ లెవెల్
- ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స పూర్తి: సర్జరీ సక్సెస్, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందంటే?
- ‘బ్లడీ రోమియో’ విధ్వంసానికి గెట్ రెడీ.. ధురంధర్ సంగీత దర్శకుడైతే కాదు!
- బుకింగ్స్ లో ‘కొరియన్ కనకరాజు’ నిలకడ.. రికార్డు మార్క్ కి చేరువలో
- ‘ఇరుముడి’ ట్రైలర్ టాక్ : భక్తి, యాక్షన్ కలగలిపిన మాస్ ఎమోషనల్ డ్రామా!
- వెంకీతో బయోపిక్ చేయాల్సింది.. కానీ కుదర్లేదు – సూర్య

