ప్రముఖ నిర్మాత చేతికి ‘బ్లఫ్ మాస్టర్’ నైజాం హక్కులు !

ప్రముఖ నిర్మాత చేతికి ‘బ్లఫ్ మాస్టర్’ నైజాం హక్కులు !

Published on Dec 23, 2018 10:18 PM IST

Bluffmaster4

కోలీవుడ్ లో 2014 లో విడుదలైసూపర్ హిట్టయిన చిత్రం ‘సతురంగ వెట్టై’. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి హెచ్ . వినోత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో రీమేక్ అవుతుంది.

సత్యదేవ్ హీరో గా నటిస్తున్న ఈచిత్రాన్ని నూతన దర్శకుడు గోపి గణేష్ పట్టాభి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ఫేమ్ నందిత శ్వేతా కథానాయికగా నటిస్తుంది.

ఇక ఈ చిత్రాన్ని నైజాం మరియు వైజాగ్ లో ప్రముఖ నిర్మాత, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ అధినేత దిల్ రాజు విడుదలచేస్తున్నారు. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 28న విడుదలకానుంది.

తాజా వార్తలు