‘దేవ్‌’ న్యూ అప్ డేట్ తో వచ్చాడు !

‘దేవ్‌’ న్యూ అప్ డేట్ తో వచ్చాడు !

Published on Jan 10, 2019 7:02 PM IST

Dev

తమిళ్ స్టార్ హీరో కార్తీ హీరోగా రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవ్‌’. తాజాగా ఈ సినిమా ఆడియో విడుద‌ల ఈవెంట్ ను జ‌న‌వ‌రి 14వ తేదీన జరపనున్నామని చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, నిక్కీ గల్రాని కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇక వాలెంటైన్స్ డే కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుంది దేవ్. ఈ సినిమా పై మంచి అంచనాలున్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా కి హరీష్‌ జయరాజ్‌ సంగీతమందిస్తున్నారు.

తాజా వార్తలు