తమిళ హీరో శివ కార్తికేయన్ , సమంత జంటగా నటించిన చిత్రం ‘సీమ రాజా’. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈచిత్రం మిక్సడ్ టాక్ ను తెచ్చుకున్న కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ ఏడాది న్యూ ఇయర్ రోజున సన్ టీవీ లో ప్రసారం చేశారు. ఈచిత్రం ఏకంగా 21.52 రేటింగ్ పాయింట్స్ ను రాబట్టి కోలీవుడ్ లో అల్ టైం సెకండ్ బెస్ట్ ప్రీమియర్స్ గా రికార్డు సృష్టించింది.
అంతేకాకుండా గత రెండు సంవత్సరాల్లో నంబర్ 1 తమిళ ప్రీమియర్ గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. పోనరం తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ని ఆర్ డి రాజా నిర్మించారు. ఇక శివ కార్తికేయన్ కు తమిళంలో మంచి ఫాలోయింగ్ వుంది.


