కేజీఎఫ్ కు సీక్వెల్ లో సంజయ్ దత్ – రమ్యకృష్ణ ?

కేజీఎఫ్ కు సీక్వెల్ లో సంజయ్ దత్ – రమ్యకృష్ణ ?

Published on Jan 12, 2019 3:06 AM IST

sanjay ramyakrishna

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్’ చిత్రం ఐదు భాషల్లో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో కేజీఎఫ్ కు సీక్వెల్ చేసేందుకు కేజీఎఫ్ చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన వర్క్ జరుగుతుంది.

అయితే ఈ సీక్వెల్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్, అలాగే రమ్యకృష్ణ కూడా నటిస్తున్నారని సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో గాని, ఒకవేళ ఈ ఇద్దరూ కేజీఎఫ్ కు సీక్వెల్ లో నటిస్తే మాత్రం.. దక్షిణాది భాషల్లోనే కాకుండా అటు బాలీవుడ్ లోనూ ఈ సీక్వెల్ కు భారీ డిమాండ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తాజా వార్తలు