ఈ ఏడాది మచ్ అవైటెడ్ మూవీ గా రానున్న చిత్రం ‘ఎన్ జి కె’ . పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ఈ చిత్రం ఫై కోలీవుడ్ లో భారీ అంచనాలు వున్నాయి. ఇక నిన్నటి తో ఈచిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యింది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ నటుడు జగపతి బాబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
ఇక ఈచిత్రంలో సూర్య రైతు సమస్యలపై పోరాడే రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం ఫై ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ్తో పాటు తెలుగులోనూ ఏప్రిల్14న విడుదలకానుంది.


