డిస్కోరాజా గా మాస్ రాజా !

డిస్కోరాజా గా మాస్ రాజా !

Published on Jan 26, 2019 8:12 AM IST

Disco Raja
ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ , ‘నటించనున్న చిత్రానికి ముందుగా చెప్పినట్లే ‘డిస్కోరాజా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈ చిత్రం యొక్క టైటిల్ లోగోను ఈరోజు రవితేజ పుట్టిన రోజు సందర్బంగా విడుదలచేశారు. ఈ టైటిల్ లోగో ఆసక్తికరంగా ఉండి అప్పుడే సినిమా ఫై అంచనాలను పెంచేసింది. సై -ఫై థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ పతాకం ఫై రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనుండగా సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. మరి ఇటీవల వరస పరాజయాలను చవిచూసిన రవితేజ ఈ చిత్రం తోనైనా హిట్టు కొడతాడోలేదో చూడాలి.

తాజా వార్తలు