అవసరమైతే క్రేజీ హీరో స్క్రిప్ట్ రైటర్ కూడా అంట !

అవసరమైతే క్రేజీ హీరో స్క్రిప్ట్ రైటర్ కూడా అంట !

Published on Jan 27, 2019 10:14 PM IST

Vijay

‘పెళ్లి చూపులు’ అంటూ తెలుగు తెర ఫై మెరిసి.. ‘అర్జున్ రెడ్డి’గా స్టార్ స్టేటస్ సంపాదించుకొని.. ‘గీతగోవిందం’, ‘టాక్సీవాలా’ తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. దీనికి తోడు గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరో అయిపోవడంతో స్టార్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు విజయ్ వెంట పడుతున్నారు.

అయితే, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పాడు. ఒకవేళ విజయ్ దేవరకొండ నటుడిగా ఫెయిల్ అయితే.. తనకి ఎల్లప్పుడూ ‘ప్లాన్ బి’ ఆప్షన్ ఉందని తెలిపాడు. ఇంతకీ ఆ ప్లాన్ బి ఏంటంటే.. స్క్రిప్ట్ రైటర్ గా, లేదా డైరెక్టర్ గా విజయ్ దేవరకొండ మారతాడట. ఏమైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తానూ చివరివరకు ఇండస్ట్రీలోనే ఉంటానని విజయ్ చెప్పుకొచ్చాడు.

తాజా వార్తలు