‘హిర‌ణ్య‌ క‌శిప‌’ గురించి సురేష్ బాబు ఆసక్తికరమైన విషయాలు !

‘హిర‌ణ్య‌ క‌శిప‌’ గురించి సురేష్ బాబు ఆసక్తికరమైన విషయాలు !

Published on Jun 6, 2019 3:00 AM IST

Rana Daggubati

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రగా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘హిర‌ణ్య‌ క‌శిప‌’కు సంబంధించి నిర్మాత సురేష్ బాబు ఆసక్తికర విషయాలు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…’ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాదాపు వందమందితో గత రెండు సంవత్సరాల నుంచి జరుగతుందని.. ఇప్పటికే గ్రాఫిక్స్ కి సంబంధించిన ప్లానింగ్ సిద్ధమైపోయిందని.. అలాగే భారీ సెట్స్ నిర్మాణాలు కూడా ముగింపు దశకి చేరుకున్నాయని ఆయన తెలిపారు.

అయితే పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీ అయిన తరువాతే సినిమా మొదలవుతుందని.. హిరణ్య కశిప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రం అవుతుందని సురేష్ బాబు తెలిపారు. సురేష్ బాబు ఇంకా మాట్లాడుతూ.. దర్శకులు తరుణ్ భాస్కర్, త్రినాధరావు కాంబినేషన్లలో వెంకటేష్ చిత్రాలు ఉంటాయని స్పష్టం చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు