
నాని హీరోగా నటిస్తున్న ‘జెండా పై కపిరాజు’ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ స్పాట్ కి కొంత మంది ప్రముఖులు హాజరై నానిని ఆశ్చర్యానికి గురి చేశారు. వాళ్ళు ఎవరో అతని మాటల్లోనే విందాం.’ ప్రస్తుతం ‘జెండా పై కపిరాజు’ చిత్రీకరణ గోవాలో జరుగుతోంది, ఈ రోజు షూటింగ్ స్పాట్ కి కొంతమంది అతిధులు వచ్చారు, వారు ఎవరో చెప్పుకోండి చూద్దాం?.. ఎవరో కాదండి.. రాజమౌళి గారు, రమ గారు, వల్లి గారు, సాయి గారు మరియు కార్తికేయ అతిధులుగా వచ్చారు. వారిని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని’ నాని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. నాని మరియు రాజమౌళి కలిసి పనిచేసిన ‘ఈగ’ చిత్రం గత నెలలో విడుదలై టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రాజమౌళి తన కుటుంబంతో కలిసి గోవాకి వెకేషన్ వెళ్ళారని మేము ఇది వరకే తెలిపాము, అందువల్లే అక్కడే జరుగుతున్న నాని సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్ళారు. ‘జెండా పై కపిరాజు’ చిత్రంలో నాని సరసన అమలా పాల్ కథానాయికగా నటిస్తుండగా, సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఒక సామాన్యమైన వ్యక్తి నలుగురికి మంచి చేసే ఒక విషయం కోసం పోరాడటమే ఈ చిత్ర కథాంశం. ఈ నెల మొదట్లో కేరళలోని చలకుడిలో ప్రారంభమైన ఈ చిత్రం చిత్రీకరణ అక్కడ పూర్తవడంతో తదుపరి షెడ్యూల్ కోసం వెంటనే ఈ చిత్ర టీం గోవా చేరుకొని అక్కడ షూటింగ్ చేస్తున్నారు.
గోవాలో వారిని చూసి షాక్ అయిన నాని.!
గోవాలో వారిని చూసి షాక్ అయిన నాని.!
Published on Aug 17, 2012 12:13 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- ‘శనార్తి’ కోసం చేతులు కలిపిన అఖిల్ రాజ్-నాగదుర్గ
- సంజయ్ విశ్వనాథ్ ర్యాంపేజ్ షురూ.. మాస్ జంప్ తో సూర్య సినిమా!
- అఫీషియల్: ‘జార్జ్ క్రిష్’ గా శర్వా, శ్రీను వైట్ల ఎంటర్టైనర్.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- గ్రామీణ నేపథ్యంలో ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ మూవీ ప్రారంభం!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”

