హరీష్ శంకర్ మరియు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. గత కొన్ని రోజులుగా ఈ చిత్ర టైటిల్ ‘జనగణమన’ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి నిర్మాత అయిన దిల్ రాజు ఇటీవలే తన రాబోయే చిత్రాల కోసం ‘జనగణమన’ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి. ఈ వార్తల్ని హరీష్ శంకర్ కొట్టిపారేశారు మరియు నా చిత్రానికి అది టైటిల్ కాదని ఆయన స్టేట్ మెంట్ ఇచ్చారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తర్వాత హరీష్ ఎలాంటి సినిమా చేస్తాడా అని అందరి చూపులు ఆయన పైనే ఉన్నాయి. ఎన్.టి.ఆర్ సినిమాకి ‘ఎం ఎల్ ఏ(మంచి లక్షణాలున్న అబ్బాయి)’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ‘బాద్షా’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ సినిమా ప్రారంభమవుతుంది.
ఎన్.టి.ఆర్ టైటిల్ అది కాదు : హరీష్ శంకర్
ఎన్.టి.ఆర్ టైటిల్ అది కాదు : హరీష్ శంకర్
Published on Aug 20, 2012 10:58 PM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్.. డబుల్ క్లాష్ తప్పదా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- జయ కృష్ణ కోసం సక్సెస్ చిత్రాల దర్శకుడు..?
- భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేసిన ‘భోగి’
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- మాస్ ప్రోమోతో తలైవర్ ‘ధర్మన్’పై సింపుల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
- ‘ఇరుముడి’పై రవితేజ ఎమోషనల్ వర్డ్స్..!
- ‘రాకా’తో అట్లీ ప్లాన్ చేసేది ఇదేనా..?
- బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఎం.ఎస్. రాజు ‘అగధ’ వరకు..7 చిత్రాలు విడుదల!
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ట్రైలర్ తో మరింత పాజిటివ్ సొంతం చేసుకున్న “ఇరుముడి”
- ‘టాక్సిక్’ రన్టైమ్తో సర్ప్రైజ్ చేయనున్న యష్.. ఎంతంటే..?
- వరల్డ్ వైడ్ ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టోటల్ టార్గెట్ ఎంతంటే!


