ముంబైలో రకుల్‌ను చుట్టుముట్టి డబ్బులు అడిగారు

ముంబైలో రకుల్‌ను చుట్టుముట్టి డబ్బులు అడిగారు

Published on Jul 6, 2019 1:04 AM IST

rakul

సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ఈమధ్యే ఆమె చేసిన చిత్రం ‘దే దే ప్యార్ దే’ భారీ విజయాన్ని సాధించడంతో ఆమెకు బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆమె తరచూ ముంబై వెళుతున్నారు. అలా తాజాగా ముంబై వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.

ముంబైలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న ఫార్మర్స్ కేఫ్ రెస్టారెంట్ నుండి బయటికొచ్చిన ఆమె కారు ఎక్కబోతుండగా కొందరు పిల్లలు, మహిళలు ఆమె చుట్టూ మూగి, చేతులు పట్టుకుని డబ్బులు ఇవ్వమని బలవంతపెట్టారు. రకుల్ వారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినా వారు వదల్లేదు. ఇంతలో అక్కడున్న రెస్టారెంట్ సిబ్బంది వచ్చి చుట్టూ ఉన్నవారిని కంట్రోల్ చేయడంతో రకుల్ తన కారెక్కి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మొత్తానికి ఆ పిల్లలంతా కాసేపు రకుల్‌ను కంగారుపెట్టేశారు.

View this post on Instagram

The solid salad surprise ? #rakulpreetsingh

A post shared by Viral Bhayani (@viralbhayani) on

సంబంధిత సమాచారం

తాజా వార్తలు