స్మిత.. 20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం !

స్మిత.. 20 ఏళ్ల ఓ సంగీత ప్ర‌యాణం !

Published on Jul 17, 2019 3:19 PM IST

తెలుగులో ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయని మరియు నర్తకి స్మిత తన ప్రయాణం గురించి చెప్తూ.. 1996లో మొద‌ట నేను పాడ‌తా తీయ‌గాలో తొలిసారి మైక్ ప‌ట్టుకున్న క్ష‌ణం నుంచి నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు కూడా అదే ఉత్సాహం. అస‌లే మాత్రం అంచ‌నాలు లేకుండా.. ఏం జ‌రుగుతుందో ఇక్క‌డ ఎలా ఉంటుందో తెలియ‌కుండానే వ‌చ్చాను. మ్యూజిక్, డాన్స్ లో మ‌రింత శోధ‌న చేసి ఎదిగాను. 20 ఏళ్లైపోయింది. ఇప్పుడు ఒక్క‌సారి వెన‌క్కి తిరిగి చూసుకుంటే నా ఈ ప్ర‌యాణం ఎంతో ఆనందంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ఇండిపాప్ నేనే అయినందుకు చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. 10 కంటే ఎక్కువ భాష‌ల్లో పాడ‌టం కూడా నాకు గొప్ప అనుభ‌వం. వీట‌న్నింటితో పాటు 12 ఆల్బ‌మ్స్, 17 మ్యూజిక‌ల్ వీడియోలు, 100కు పైగా ప్లే బ్యాక్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్స‌ర్ట్స్.. ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావ‌డం ఇవ‌న్నీ జీవితంలో ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని తీపి అనుభూతులే.

జులై 22న నా ఈ మ్యూజిక్ అండ్ డాన్స్ జ‌ర్నీకి సంబంధించిన ఓ సెల‌బ్రేష‌న్ ఉంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం అయిన ప్ర‌తీ ఒక్క‌ర్ని అందులో నేను గుర్తు చేసుకోవాల‌నుకుంటున్నాను. నా ప్ర‌యాణం క్యాసెట్ నుంచి సిడి, సీడి నుంచి పెన్ డ్రైవ్స్, పెన్ డ్రైవ్స్ నుంచి డిజిట‌ల్ వ్యూస్ ఇలా ఎన్నో మారిపోయాయి. ఇంత సాధించ‌డానికి నాకు ఎంతో సాయం చేసిన వాళ్లంద‌ర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్ల‌కు మ‌న‌సారా కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకోడానికి ఏర్పాటు చేసుకున్నాను. జులై 22 సాయంత్రం 7 గంట‌ల నుంచి హైద‌రాబాద్ జెఆర్సీ క‌న్వెన్ష‌న్ హాల్ లో ఈ వేడుక‌ను ఎంజాయ్ చేద్దాం..

ప్రేమ‌తో
స్మిత

వీడియో కోసం క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు