ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ నాయికగా తెరకెక్కిన చిత్రం గుణ 369. బోయపాటి శ్రీను దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అర్జున్ జంధ్యాల దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రమిది. శ్రీమతి ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, ఎస్‌జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలోని తొలి రెండు పాటలను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదుగా మూడో పాట ‘మనసుకిది’ని విడుదల చేశారు. పాట నెటిజన్లను బాగానే ఆకట్టుకునేలా ఉంది.
ఇటీవల ట్రైలర్‌ను స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను ఆవిష్కరించారు. తాజాగా మూడో పాటను విడుదల చేసిన
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ గుణ 369 ట్రైలర్ చూశా. ఇవాళ నా చేతుల మీదుగా ఓ పాట విడుదలైంది. సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరపరచగా, రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాట చాలా బావుంది. ట్యూన్ బావుంది. లిరిక్ బావుంది. దృశ్యాన్ని చిత్రీకరించిన తీరు బావుంది. ట్రైలర్‌లో హీరో పెర్ఫార్మెన్స్, యాక్షన్ బావుంది. ఈ సినిమాను నాకు ఎంతో సన్నిహితులైన అనిల్, ప్రవీణ, తిరుమల్‌రెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పనిచేసిన మిగిలిన టెక్నీషియన్లు అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు.
పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.


