మన్మధుడు ఫీల్ గుడ్ సాంగ్ తో అలరించాడుగా

మన్మధుడు ఫీల్ గుడ్ సాంగ్ తో అలరించాడుగా

Published on Jul 29, 2019 1:56 PM IST

కింగ్ నాగార్జున మన్మథుడిగా థియేటర్లలో సందడి చేయడానికి ఇంకొద్ది రోజులే మిగిలివుంది. నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రొమోషన్స్ లో కూడా ఆయన విరివిగా పాల్గొంటున్నారు. నేడు రెడ్ ఎఫ్ ఎం రేడియో స్టేషన్ లో కూడా నాగ్, రకుల్ ఓ ప్రమోషనల్ క్రార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కాగా కొద్దిసేపటి క్రితం ‘మన్మధుడు 2’ చిత్రంలోని ఓ లిరికల్ సాంగ్ చిత్ర యూనిట్ విడుదల చేశారు. రచయిత శుబ్రమ్ విశ్వనాధ్ అందించిన ఆహ్లాదకరమైన లిరిక్స్ కి చైతన్ భరద్వాజ్ అందించిన అద్భుతమైన సంగీతానికి మైమరపించే చిన్మయి గాత్రం తోడవ్వడంతో ‘నాలోనా’ మెలోడీ సాంగ్ ఆసక్తికరంగా సాగింది.ఆకట్టుకొనే ట్రైలర్, అలరించే సాంగ్స్ ‘మన్మధుడు 2’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి.

వికామ్ 18 స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ , మనం ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్,రావు రమేష్,ఝాన్సీ,లక్ష్మీ ఇతరపాత్రలలో నటిస్తున్నారు. ఆగస్టు 9న గ్రాండ్ గా విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు