సక్సెస్ మీట్ లో ‘నేను లేను’ !

సక్సెస్ మీట్ లో ‘నేను లేను’ !

Published on Jul 31, 2019 10:13 PM IST

ఓ.య‌స్‌.యం విజన్ – దివ్యాషిక క్రియేష‌న్స్ పతాకాలపై సుక్రి కుమార్ నిర్మాతగా రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ నేను లేను… లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. రామ్ కుమార్ దర్శకుడు. హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన‌ ఈ చిత్రం జూలై 26న విడుద‌లైంది. ఇంకా థియేటర్స్ లో ఈ సినిమా ప్రదర్శింబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో.. దర్శకుడు రామ్ కుమార్ మాట్లాడుతూ – “మా సినిమాలో ఉన్న కాన్సెప్ట్ ఎక్కడినుండి కాపీ కొట్టలేదు. ఒక జెన్యూన్ పాయింట్ మీద చాలా సంవత్సరాలు కష్టపడి రాసుకున్న స్టోరీ. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ మీద ఏ సినిమా రాలేదు. మా సినిమాకి అటు ఆడియన్స్ ఇటు సినీ విశ్శ్లేషకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ నిర్మాతలకి బుక్ మై షో కి మధ్యవర్తిగా పనిచేస్తున్న కొందరి వల్ల మా సినిమాకు సరైన రేటింగ్స్ రాలేదు. దాంతో మాకు మల్టిప్లెక్స్ థియేటర్స్ లభించలేదు. దాంతో కొంత సినిమాకు నష్టం జరిగింది. అయినప్పటికీ త్వరలోనే అమెజాన్ లో సినిమా రాబోతుంది” అన్నారు.

హీరో వర్షిత్ మాట్లాడుతూ – “చాలా కొత్త కాన్సెప్ట్ అని నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి అభినందిస్తున్నారు. ఇంతవరకు ఎవరూ రైజ్ చేయని ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. ఇంతమంచి సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రామ్ కుమార్ గారికి థాంక్స్. అలాగే ఆర్.ఆర్, క్లైమాక్స్ ఫైట్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒక థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన అమౌంట్ ఇవ్వలేదని బుక్ మై షో లో రేటింగ్స్ తగ్గించడం జరిగింది. ఒక చిన్న సినిమాకి ఇలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా మీడియా సపోర్ట్ కావాలి” అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు