
రవితేజ మరియు శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “బలుపు” అక్టోబర్‌లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు ప్రసాద్ వి పోట్లురి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు గతంలో గోపీచంద్ మరియు రవి తేజ కలయికలో “డాన్ శీను” చిత్రం వచ్చి విజయం సాదించింది. అలాంటి వినోదాత్మక అంశాలున్న మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని సమాచారం. “గబ్బర్ సింగ్” చిత్రం తరువాత శృతి హాసన్ ఒప్పుకున్న మొదటి చిత్రం ఇదే. ఇందులో తన పాత్రకి మంచి హాస్యాన్ని పండించే అవకాశం ఉందని ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. రవితేజ మరియు శృతి హాసన్ కలయిక ఆశ్చర్యం కలిగించేదే, తెర మీద వీరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం రవితేజ “సార్ వస్తారా” చిత్రంలో నటిస్తున్నారు ఇది కాకుండా మరి కొంతమంది దర్శకులతో కథా చర్చల్లో ఉన్నారు శృతి హాసన్, ప్రభుదేవా రాబోతున్న చిత్రం “నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” హిందీ రీమేక్‌లో కనిపించనుంది.
అక్టోబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న బలుపు
అక్టోబర్ లో చిత్రీకరణ మొదలు పెట్టుకోనున్న బలుపు
Published on Sep 1, 2012 8:46 AM IST
సంబంధిత సమాచారం
- ధనుష్ తో గొప్ప అనుబంధం ఉండేదట !
- ‘త్రిష’ పోస్ట్ కి కారణం విజయ్ మీద ప్రేమేనా ?
- నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్ర ఇది – మృణాల్ ఠాకూర్
- హీరోగా దర్శకుడు.. దిల్ రాజు క్లారిటీ !
- శర్వానంద్ లో ఈ ఆకస్మిక మార్పుకి కారణం?
- ఆ డీఫ్ ఫేక్ ఫోటో పై జాన్వీ కపూర్ కామెంట్స్ !
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- ఒక్క ఇండియా నుంచే ‘ధురంధర్ 2’ 1000 కోట్లు కొట్టేసిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?
- ప్రదీప్ రంగనాథన్ తెలుగు మార్కెట్.. దిల్ రాజుకు క్రెడిట్
- “విశ్వంభర” మరింత ఆలస్యం!?
- ‘రామాయణ’ కోసం రెహమాన్ కి షాకింగ్ రెమ్యునరేషన్?
- ఫోటో మూమెంట్: తన లవ్ లైఫ్ అండ్ ఫ్యామిలీతో బెల్లంకొండ శ్రీనివాస్
- తన గ్లామ్ షోతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ‘డెకాయిట్’ బ్యూటీ!
- ‘రామాయణ’ రన్‌టైమ్ చెప్పేసిన రణ్‌బీర్ కపూర్.. ఎంతంటే..?
- మోక్షజ్ఞ మొదటి సినిమా పరిస్థితేంటి ?

