పెద్ద హీరోని అయ్యుంటే ‘గ్యాంగ్ లీడర్’ చేయడానికి ఆలోచించే వాడినేమో..?

పెద్ద హీరోని అయ్యుంటే ‘గ్యాంగ్ లీడర్’ చేయడానికి ఆలోచించే వాడినేమో..?

Published on Sep 3, 2019 1:01 AM IST

నేచ్యురల్ స్టార్ నాని చేస్తున్న కొత్త చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరో కార్తికేయ నెగెటివ్ రోల్ చేయడం జరిగింది. ‘ఆర్ఎక్స్ 100’ లాంటి భారీ హిట్ సాదించిన హీరో నెగెటివ్ రోల్ చేయడంతో ప్రేక్షకులు కొంత ఆశ్చర్యానికి లొనయ్యారు. కానీ కార్తికేయ మాత్రం ఈ చిత్రం చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు.

ప్రస్తుతం తాను హీరోగా ఎదుగుతున్నాను కాబట్టే ఇలాంటి మంచి సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఒప్పుకున్నానని, ఒకవేళ తాను పెద్ద హీరోని అయ్యుంటే ఈ సినిమా ఒప్పుకోవడానికి ఆలోచించేవాడినేమో అని, మొత్తానికి ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నానని, హీరోగా చేసిన ‘ఆర్ఎక్స్ 100, హిప్పీ, గుణ 369’ లాంటి చిత్రాల విడుదల సమయంలో కూడా ఇంత ఎగ్జైట్ కాలేదని తన మనసులో మాటను బయటపెట్టారు. ఇకపోతే మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 12న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు