సాహో వసూళ్ల పరంపర కొంచెం నెమ్మదించిందనే చెప్పాలి. సాహో నైజాంలో మొదటి రోజు 9.4 కోట్ల షేర్ తో బాహుబలి 2 కి మించిన వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పినా క్రమేణా తగ్గుతూ వచ్చింది. సోమవారం వరకు సెలవు దినాలు కావడంతో సాహో మంచి వసూళ్లను రాబట్టింది. మంగళవారం వర్కింగ్ డే అయ్యేసరికి ఈ చిత్ర వసూళ్ళలో భారీ తగ్గుదల నమోదైంది. మంగళవారం సాహో నైజాంలో 1.49 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తుంది. దీనితో కలిపి మొత్తంగా ఐదు రోజులకుగానూ 24.76 కోట్ల షేర్ సాధించింది.
ఇవి చెప్పుకోదగ్గ వసూళ్లే అయినప్పటికీ సాహో థియరిటికల్ రైట్స్ దాదాపు 40కు పైగా అమ్మడంతో సాహో సాధించాల్సిన వసూళ్ల లెక్క ఇంకా చాలానే మిగిలివుంది. ఐతే ఈ వారం కూడా సాహో చిత్రానికి పోటీ ఇచ్చే పెద్ద సినిమాల విడుదల లేకపోవడం కలిసొచ్చే అంశం.


