విడుదలైన జయలితగా రమ్యకృష్ణ లుక్

విడుదలైన జయలితగా రమ్యకృష్ణ లుక్

Published on Sep 7, 2019 10:34 AM IST

Ramya Krishna

తమిళ రాజకీయాలలో జయలలిత జీవితం ఒక సంచలనం. ఒక సినిమాకి మించిన మలుపులు, కాల్పనికత ఆమె నిజజీవితం కలిగివుంది. అందుకే ఆమె బయోపిక్ అనేది అందరి దర్శకుల హాట్ ఫేవరేట్ గా మారింది. దాదాపు మూడు చిత్రాలకు పైగా జయలిత జీవితంగా ఆధారంగా తెరకెక్కుతున్నాయి. కాగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆమె జీవితం ఆధారంగా వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయలితగా తెలుగు సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ నటించడం విశేషం.

Qeen

కాగా క్వీన్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. నేడు జయలలిత గా రమ్యకృష్ణ లుక్ ని విడుదల చేయడం జరిగింది. జెండా అంచు కలిగిన తెల్ల చీర ధరించి , వేదికపై నిలబడి ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న ఆమె ఫోటో ఆసక్తికరంగా ఉంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు