
విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా, యోగా బ్యూటీ అనుష్క కథానాయికగా నటించిన ‘శివతాండవం’ చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో నటీనటుల డబ్బింగ్ కార్యక్రమాలు శబ్దాలయా స్టూడియోలో జరుగుతున్నాయి. ఈ చిత్రంలో ఎకోలేషణ్ టెక్నిక్ లో సిద్దహస్తుడైన అంధుడి పాత్రలో విక్రమ్ కనిపించనున్నారు. ఈ పాత్రను ఎకోలేషణ్ టెక్నిక్ లో ఆరితేరిన డానియల్ క్రిష్ అనే అంధుడిని స్పూర్తిగా తీసుకుని చేసారు. ఈ చిత్రంలో జగపతి బాబు, అమీ జాక్సన్ మరియు లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సి కళ్యాన్ నిర్మించారు. జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోన్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలకు సిద్దమవుతోంది. విక్రమ్ అంధుడిగా కనిపించనున్న ఈ చిత్రం పై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి.
డబ్బింగ్లో శివతాండవం
డబ్బింగ్లో శివతాండవం
Published on Sep 17, 2012 4:44 PM IST
సంబంధిత సమాచారం
- మహేష్, ప్రభాస్ ఫెయిల్.. బన్నీ అయినా చేస్తాడా..?
- ‘టాక్సిక్’ లో వల్గారిటీ.. యశ్ ఇచ్చాడు క్లారిటీ..!
- 51 ఇయర్స్ ఆఫ్ తలైవా.. ‘ధర్మన్’ సెట్స్ లో గ్రాండ్ సెలెబ్రేషన్స్..!
- ‘లెనిన్’ సక్సెస్.. అఖిల్ సైలెంట్.. ఎందుకో..?
- సూర్యతో ఎప్పటికైనా సినిమా చేస్తా – త్రివిక్రమ్
- ఘనంగా శ్రీహరి జయంతి వేడుకలు..!
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

