
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్షకుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన గ్రాఫికల్ మానియా ‘ఈగ’. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘మక్కీ’ అనే పేరుతో అక్టోబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తన వాయిస్ అందించనున్నారు. ఈ విషయాన్ని రాజమౌళి గారే తెలిపారు. ‘ నిన్న రాత్రి అజయ్ దేవగన్ ‘మక్కీ’ సినిమాను చూసారు. ఆయనకి చాలా బాగా నచ్చడంతో సినిమా మొదట్లో మరియు చివర్లో వచ్చే తండ్రి పాత్రకి డబ్బించి చెప్పడానికి అంగీకరించారు. ఆయనకి నా ధన్యవాదాలు అని’ రాజమౌళి తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పటికే తెలుగు మరియు తమిళంలో విజయం సాదించిన ఈ సినిమా హిందీ వెర్షన్ పై ఉన్న అంచనాలు అజయ్ దేవగన్ ఈ చిత్రంలో వాయిస్ అందిస్తున్నాడని తెలియగానే రెట్టింపయ్యాయి. నాని, సమంత మరియు సుధీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం క్రీమ్(ఎం.ఎం కీరవాణి) సంగీతం అందించారు.
‘ఈగ’ హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ వాయిస్
‘ఈగ’ హిందీ వెర్షన్లో అజయ్ దేవగన్ వాయిస్
Published on Sep 27, 2012 10:16 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఆస్మాన్’తో మేఘాంశ్ సక్సెస్ అందుకోవాలి – శాంతి శ్రీహరి
- 3 నెలల్లో 2 బ్లాక్ బస్టర్స్.. సూర్య సత్తా ఇది..!
- మరోసారి సంక్రాంతి బరిలోకి ప్రశాంత్ వర్మ సినిమా!?
- పోల్ : ఇండిపెండెన్స్ డే వీక్ రిలీజ్ లలో మీకు ఏ చిత్రం నచ్చింది?
- విశాల్ కెరీర్ లోనే డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’కి షాకింగ్ నంబర్స్?
- సంక్రాంతి బరిలో సంబరాల ఏటి గట్టు.. రిలీజ్ డేట్ ఫిక్స్..!
- రక్తచరిత్ర రాయనున్న ‘ఫౌజీ’..కొత్త పోస్టర్ తో ప్రభాస్ అరాచకం..!
- సూర్య సినిమా సెన్సేషన్.. అప్పుడే 10 లక్షల టికెట్ల సేల్!
- స్వాతంత్ర దినోత్సవం నాడు అల్లు అర్జున్ మిస్టేక్ పోస్ట్.. వెంటనే డిలీట్!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : విశ్వనాథ్ అండ్ సన్స్ – మెప్పించే ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా!
- సమీక్ష: ‘అగధ’ – కొన్ని చోట్ల ఓకే అనిపించే థ్రిల్లర్ డ్రామా
- సమీక్ష : మకుటం – బోరింగ్ యాక్షన్ డ్రామా !
- ‘ది ప్యారడైజ్’ ఆ సీనియర్ యాక్టర్‌కు కలిసి వస్తుందా..?
- ‘ఆదర్శ కుటుంబం’ కోసం రాజుగారి ప్రయత్నం.. ఫలించేనా..?
- ‘విశ్వనాథ్ అండ్ సన్స్’కు అక్కడ రిలీజ్ కష్టాలు..!
- మరో భాషలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’
- సమీక్ష: హుషార్ పిట్టలు – కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టినా సందేశం బాగుంది

